అందుకోసం ‘జై లవకుశ’ వేడుక రద్దు
అందుకోసం ‘జై లవకుశ’ వేడుక రద్దు
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబరు 3న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ రూపొందించిన ఆల్బమ్ అందరికీ నచ్చుతుందని పేర్కొంది. ఆడియో విడుదల వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేశామని.. కానీ భారీ వర్షాలు, వినాయక నిమజ్జనం నేపథ్యంలో ప్రజల భద్రతని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసుకున్నామని చెప్పింది. అభిమానుల కోసం సెప్టెంబరు 10న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పబ్లిక్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అప్పుడే సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ ‘జై లవకుశ’ని నిర్మిస్తున్నారు. నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలు. ఇందులో తారక్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారు. హాలీవుడ్ నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
No comments:
Post a Comment