You

AMARAVATI999      AMARAVATI999      AMARAVATI999     AMARAVATI999      AMARAVATI999

Top Navigation Example

SUPER FAST UPDATES FOR YOU..on Nation, Electronic Gadjets, Technology, Education-Study time, Global Updates, Devotional, Entertainment, Political Updates, Special Storys, Health, Sports.

Friday, 8 September 2017

Kusa teaser don't forget to see

Kusa treaser .....don't forgot to watch

పాకిస్థాన్‌కు అమెరికా మరో షాక్‌!


    
Click hear                     
న్యూయార్క్‌: ఉగ్రవాదులను నియంత్రించడంలో పాకిస్థాన్‌ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని భావించిన అమెరికా ఆ దేశానికి రక్షణ సాయాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులకు నిధులను పంపిస్తూ, మనీలాండరింగ్‌కు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్‌లోని పాక్‌ ప్రైవేటు బ్యాంకు హబీబ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(హెచ్‌బీఎల్‌) బ్రాంచ్‌ను మూసివేయాల్సిందిగా న్యూయార్క్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(డీఎఫ్‌ఎస్‌) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను గురువారం డీఎఫ్‌ఎస్‌ విడుదల చేసింది. బ్యాంకింగ్‌ చట్టాలను ఉల్లంఘించి లావాదేవీలు జరిపినందుకు గానూ, బ్యాంకింగ్‌ రెగ్యులేటరీ హెచ్‌బీఎల్‌కు 225 మిలియన్‌ డాలర్లు జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించింది. తొలుత 629.6మిలియన్‌ డాలర్లు జరిమానా చెల్లించాల్సిందిగా డీఎఫ్‌ఎస్‌ ప్రతిపాదించినప్పటికీ చివరికి 225 మిలియన్‌డాలర్లు చెల్లించాలని తెలిపింది.
అల్‌ఖైదా లింకులకు ఈ బ్యాంకు ద్వారా బిలియన్ల డాలర్ల లావాదేవీలు జరిగినట్లు డీఎఫ్‌ఎస్‌ విచారణలో వెల్లడైంది. ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఆ బ్యాంకు బ్రాంచ్‌ నుంచి 13వేల లావాదేవీలు జరిగాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఆయుధాల డీలర్లుతో పాటు పలువురు ఈ బ్యాంకు నుంచి ఎటువంటి స్క్రీనింగ్‌ లేకుండా 250మిలియన్‌ డాలర్లు వరకు లావాదేవీలు జరుపుకొనేందుకు అవకాశం ఉంది. వారందరినీ ఈ బ్యాంకు గుడ్‌ గై జాబితాగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన న్యూయార్క్‌ హబీబ్‌ బ్యాంకు లైసెన్సును తిరిగి ఇచ్చేందుకు ఆ బ్యాంకు అంగీకరించినట్లు డీఎఫ్‌ఎస్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు వెళ్లేలా లావాదేవీలు జరపడం వల్ల దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతుంది, దీన్ని డీఎఫ్‌ఎస్‌ ఎంతమాత్రం సహించబోదని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూపరిటెండెంట్‌ మారియా టి.వుల్లో హెచ్చరించారు.

వేల‌ల్లో ఉద్యోగాలు.. ల‌క్ష‌ల్లో పోటీ.. ` భిన్నంగా వెళ్తేనే విజ‌యం: ఉద‌య్‌భాస్క‌ర్‌

అమ‌రావ‌తి‌: కేవలం ఒక ప్రయత్నం ద్వారానే సివిల్స్ సాధించేయాలని కోరుకుంటే ఎక్కువ శాతం అపజయాలే ఎదుర‌వుతాయ‌నే విషయాన్ని యువ‌త గుర్తించాల‌ని ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్ పి. ఉద‌య‌భాస్క‌ర్ అన్నారు. ``21 ఏళ్ల వయసులోనే సివిల్స్ సాధించడం ఎలా?`` అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి బి.ఎల్. హనుమంతరావు ఆంగ్లంలో రచించిన పుస్తకాన్ని ఉదయభాస్కర్ విజయవాడలో ఆవిష్కరించారు. సివిల్స్ లక్ష్య సాధన కోసం ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అంతగా రాణించే అవకాశాలు ఉంటాయని, ఈ విషయంలో యువత నిరుత్సాహానికి  గురికావొద్ద‌ని సూచించారు. సివిల్స్ అయినా,   గ్రూప్స్ ప‌రీక్ష‌లైనా  సాధించాలంటే లక్షల్లో పోటీ ఉంటుందని..  వేలల్లో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయని అందువల్ల ఇతరుల కంటే భిన్నంగా శిక్షణలో ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. సివిల్స్ సాధనలో తెలుగు అభ్యర్థుల విజయాలు ఎందరో నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. బీఎల్ హనుమంత రావు సివిల్స్ పై రచించిన ఈ  పుస్తకం నిరుద్యోగులకు ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.  త‌న పుస్తకం చదివడం ద్వారా ఉత్తేజం పొంది ఒక్క‌రు సివిల్స్‌కు ఎంపికైనా త‌న ఆశ‌యం నెర‌వేరిన‌ట్టేన‌ని  ప్రభుత్వ గణాంక శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న హనుమంతరావు అన్నారు. కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి పూర్వ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Thursday, 7 September 2017

మోదీ ప్రభుత్వం తర్వాతి టార్గెట్‌ వాళ్లే!





Click hear
న్యూదిల్లీ: నల్లధన నిర్మూలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల 2.09 లక్షల డొల్ల కంపెనీల గుర్తింపును రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటి వెనక ఉన్న ‘వాస్తవ లబ్ధిదారుల’ను గుర్తించే పనిలో ఉంది. దీంతో పాటు మరిన్ని డొల్ల కంపెనీలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ఏళ్లుగా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న 2.09 లక్షల నమోదిత కంపెనీల గుర్తింపును ఇటీవల ఆర్థిక శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేసింది. సదరు బ్యాంకు ఖాతాల నుంచి గుర్తింపు రద్దైన కంపెనీల డైరెక్టర్లు సొమ్మును డ్రా చేస్తే కనీసం ఆరు నెలల నుంచి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.
గుర్తింపు రద్దైన డైరెక్టర్లు మూడేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు రిటర్నులు దాఖలు చేయకపోతే ఒకవేళ ఇతర కంపెనీలో ఏ పదవిలో ఉన్నా అనర్హత వేటు పడుతుంది. దీంతో పాటు మళ్లీ పునర్నియామకం అయ్యే అవకాశాలు కూడా రద్దవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యల వల్ల కనీసం రెండు నుంచి మూడు లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
డొల్ల కంపెనీల వెనుక ఉన్న ‘వాస్తవ లబ్ధిదారుల’ను గుర్తించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆయా కంపెనీల వెనుక ఉన్న వ్యక్తులు, వారి పాత్రకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వివరాలు సేకరిస్తున్నాయని తెలిపింది. ఏరివేత చర్యల వల్ల కేవలం నల్లధనాన్ని అరికట్టడమే కాక పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపి, సులభతర వ్యాపారనుకూల వ్యవస్థ ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.

Tuesday, 5 September 2017

రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం - ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు - పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం

Updated: September 06, 2017 02:34 (IST)
కంప్యూటరీకరణపై కాలయాపన
- రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం
ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు
పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం
GCN--->GÇNహైదరాబాద్‌: భారీ ధరలకు కొన్న పడవలను మరమ్మతుల పేరుతో వృథాగా పడేయటం.. రూ.కోట్లు వెచ్చించి నాసికరం పనులతో సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలు పడకేసేలా చేయటం.. అడ్డగోలు బిల్లులతో హరిత హోటళ్లలో నిధులు దారి మళ్లించటం.. ఇలా పర్యాటక అభివృద్ధి సంస్థలో అధికారులది ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించి నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించటం ద్వారా కొంతవరకు పరిస్థితిని అదులోపులోకి తెచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కౌంటర్లను కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ మురగబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
టెండర్ల పేరుతో కాలయాపన 
పర్యాటకుల టూర్‌ బుకింగ్స్, వివిధ ప్రాం తాల్లో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో టికెట్ల విక్రయం, హోటళ్ల లెక్కలకు సంబంధించిన కీలక విషయాల్లో కంప్యూటరీకరణ సరిగా లేదు. దీంతో కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం 2015లో రూ.రెండున్నర కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో సంబంధిత పనులు చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌.. టెండర్ల పేరుతో కాలయాపన చేసింది. ఓసారి టెండర్లు పిలవగా, కేవలం ఒకే బిడ్‌ దాఖలైందన్న కారణంతో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత అదే తరహాలో మరోసారి రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలిచి.. పనులు మొదలుపెట్టినా కొలిక్కి తేలేక పోయారు. ఇలా రెండేళ్లపాటు ఆ నిధులను కంప్యూటరీకరణ కోసం ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో నిధులను అసలు లక్ష్యం కోసం ఖర్చు చేయలేదని గుర్తించిన ఆడిట్‌ విభాగం.. కార్పొరేషన్‌ వివరణ కోరింది.
ఖాళీ బిల్లులతో నిధుల దారి మళ్లింపు
రాష్ట్రవ్యాప్తంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేస్తున్నా చాలా చోట్ల పర్యవేక్షణ సరిగా లేక నిధులు దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ బిల్లులను దగ్గర పెట్టుకుని వాటితో నిధులు దారి మళ్లిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల స్వయంగా పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్‌లోని ప్లాజా హోటల్‌లో అక్రమాల నిగ్గు తేల్చారు. హుసేన్‌సాగర్‌ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల వద్ద బోటింగ్‌ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తోంది.   
అధికారుల నిర్లక్ష్యం
ప్లాజా హోటల్, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకు కరెంటు ఖాతాలోనే ఉంచటం వల్ల పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ కోల్పోయింది. వేరే పద్ధతిలో ఇన్‌వెస్ట్‌ చేసి ఉంటే రూ.లక్షల్లో అదనంగా ఆదాయం సమకూరేదన్న విషయం ఇటీవల ఆడిట్‌ పరిశీలనతో తేలింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌ నిర్వహణకు టెండర్లు పిలిచినా సకాలంలో దాన్ని అప్పగించక భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించలేదు.

Monday, 4 September 2017

Rahul Gandhi To Visit US Yo Talk About Artificial Intelligence


Rahul Gandhi To Visit US Yo Talk About Artificial Intelligence Sources said Rahul Gandhi wants India to lead in the niche area which comes after software development, in which India has already won global recognition. Press Trust of India | Updated: Sep 05, 2017 06:58 IST Rahul Gandhi To Visit US Yo Talk About Artificial Intelligence Facilitating Rahul Gandhi's US visit is the chairman of Overseas Congress, Sam Pitroda. New Delhi: Congress vice president Rahul Gandhi is headed to the United States where he is likely to meet the pioneers of research on Artificial Intelligence (AI), the science of making machines that think like humans. Mr Gandhi, who recently returned from Norway, is gearing up for another offshore visit, this time to the Silicon Valley in the US to "expand his thoughts about artificial intelligence", party sources here said. The sources said Mr Gandhi wants India to lead in the niche area which comes after software development, in which India has already won global recognition. Show Full Article While AI is still a nascent subject to most in India, many countries including China have begun investments in the area to strengthen research in it. A senior Congress leader said the idea was to bring back knowledge and implement it at the policy level in the Congress party's vision documents. Facilitating Mr Gandhi's US visit is the chairman of Overseas Congress, Sam Pitroda, a technology innovator who was brought back to India by Rajiv Gandhi and was among those behind the telecom revolution in the country. The Congress VP had met leaders in the field of biotechnology during his Norway visit. He is currently grappling with the party's sliding electoral graph after a series of defeats. The Congress is set to lose Himachal Pradesh to the BJP in the upcoming state assembly poll. The party is weighed down by anti-incumbency sentiments and infighting in the state unit in Himachal Pradesh. In Gujarat, where elections are slated to be held later this year, it lost a veteran when party leader and former chief minister Shankarsinh Vaghela walked out of the Congress. Mr Gandhi will also address a conference on 'India At 70: Reflections On The Path Forward' at the University of California, Berkeley, on September 11.Click hear