దోమను చంపాడని.. నిషేధం విధించారు
దోమను చంపాడని.. నిషేధం విధించారు
Clickhear
శాన్‌ఫ్రాన్సిస్కో: చనిపోయిన దోమ ఫొటో పెట్టాడని ఆ వ్యక్తి ట్విటర్ ఖాతాను నిర్వాహకులు తొలగించారు. ఈ సంఘటన శాన్‌ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. జపాన్‌కి చెందిన ఓ వ్యక్తి శాన్‌ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 20న అతడు ఇంట్లో టీవీ చూస్తుండగా దోమ కుట్టిందట. ఆగ్రహంతో వూగిపోయిన అతడు ఆ దోమను చంపి దాన్ని ఫొటో తీసి ట్విటర్‌లో ఉంచాడు. అంతేకాదు ‘నేను టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకునే సమయంలో నన్ను కుట్టడానికి ప్రయత్నిస్తావా! చావు(ఇప్పటికే నువ్వు చచ్చిపోయావు)’ అని అతడు ట్విటర్లో పేర్కొన్నాడు. ఆ కొద్దిసేపటికి అతనికి ఓ మెసేజ్ వచ్చింది.
ఏమనంటే.. ‘మీ ట్విటర్ ఖాతాను తొలగిస్తున్నాం. ఇక నుంచి మీరు ఈ ఖాతాను తెరవలేరు’ అని. వెంటనే అతడు ఆగస్టు 26న మరో ట్విటర్ ఖాతా ఓపెన్ చేసి ‘చంపిన దోమ ఫొటో ట్విటర్‌లో ఉంచినందుకు నా పాత ట్విటర్ ఖాతాను పూర్తిగా నిలిపివేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమా’ అంటూ ప్రశ్నించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 32వేల మంది రీట్వీట్ చేయగా 28వేల లైక్‌లు వచ్చాయి .
హింసను ప్రేరేపించేలా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే సంబంధిత ఖాతాలను నిలిపివేస్తామని ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment