పాన్, ఆధార్ లంకె గడువు పొడిగింపు
Click hear
న్యూదిల్లీ: శాశ్వతా ఖాతా సంఖ్య (పాన్)తో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అవకాశమిచ్చింది. వాస్తవానికి అనుసంధానానికి గడువు నేటి (ఆగస్టు 31)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రిత్వ శాఖ గడువు పెంపు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఆధార్ అనుసంధానం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై నవంబర్‌లో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి గడువును డిసెంబర్ ఆఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది.
(G.GK)
No comments:
Post a Comment