పెళ్లిపీటలెక్కనున్న శ్రియ? Click hear
హైదరాబాద్: దాదాపు పదేళ్లకు పైగా చిత్రపరిశ్రమలో రాణిస్తున్న నటి శ్రియ. ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రియ దాదాపు అగ్రకథానాయకులందరితో నటించారు. తాజాగా ఆమె నందమూరి బాలకృష్ణకి జోడీగా నటించిన ‘పైసా వసూల్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే శ్రియ ఇక పెళ్లిపీటలెక్కబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ఒత్తిడికి గురిచేస్తుండడంతోఆమె వివాహానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఎప్పుడుపెళ్లి చేసుకుంటారు అని మీడియా అడిగిన ప్రశ్నకు.. త్వరలోనే చేసుకుంటానని వివాహానికి సంబంధించిన విషయాలు తానే స్వయంగా వెల్లడిస్తానని పేర్కొన్నారట.
No comments:
Post a Comment