హార్వీ బాధితులకు ట్రంప్ భారీవిరాళంClickhear
హ్యూస్టన్: హరికేన్ హార్వీ ధాటికి టెక్సాస్, లూసియానా అతలాకుతలమైంది. ఈ విపత్తు కారణంగా మృత్యువాతపడ్డవారి సంఖ్య 44కి చేరినట్లు అధికారులు తెలిపారు. వేల మంది ఇళ్లను వదిలేసి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరికొంత మంది ఎటూ వెళ్లలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమెరికా చరిత్రలోనే భారీ నష్టాన్ని మిగిల్చిన విపత్తుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ విపత్తు ధాటికి రూ.10లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వీ బాధితులకు భారీ విరాళం ప్రకటించనున్నారు. విరాళంగా ఇచ్చే నగదును ఎలా ఖర్చుపెట్టాలన్న దానిపై ట్రంప్ శ్వేతసౌథం మీడియా ప్రతినిధులను అడిగారని శాండర్స్ చెప్పారు.
ఈ శనివారం ట్రంప్.. టెక్సాస్, లూసియానాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మంగళవారం టెక్సాస్‌కి వెళ్లినప్పటికీ వరద ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో పర్యటించలేకపోయారు. ఈశాన్య టెక్సాస్, నైరుతి లూసియానాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరదలు కొనసాగే అవకాశముందని జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment