గుజరాత్‌పై హరియాణా విజయంClick hear
కోల్‌కతా: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో ఉత్కంఠకరంగా జరిగిన పోరులో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి పాలైంది. ఆ జట్టుపై 42-36 తేడాతో హరియాణా స్టీలర్స్ విజయం సాధించింది. 13 రైడ్‌పాయింట్లు సాధించిన సచిన్ ప్రదర్శనతో గుజరాత్ 20-13తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో ప్రశాంత్ కుమార్ 14 పాయింట్లతో రైడింగ్‌లో, మోహిత్ చిల్లర్ ట్యాకిల్స్‌లో చెలరేగడంతో హరియాణా స్కోరు సమం చేసింది. అదే వూపులో ప్రత్యర్థి జట్టును రెండు సార్లు ఆలౌట్ చేసి పాయింట్ల అంతరం పెంచుకొంది. చివరి వరకు అలాగే ఆడి విజయం సాధించింది.
No comments:
Post a Comment