Jio ki opposite ga offer's Airtel
ఎయిర్‌టెల్ Written By: gopikrishnasolo pubClick hear
lished:Saturday, September 2, 2017, 16:46 [IST] దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా జియో తాజా ఆఫర్‌కుపోటీగా సరికొత్త రీచార్జ్‌ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఈ కొత్త పథకాలను ప్రారంభించింది.. రూ.399 రీచార్జ్‌పై అపరిమిత లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇదిరిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన రూ.399 ఆఫర్‌ను పోలి వుండడం గమనార్హం. అలాగే రూ.149 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, రూ. 399రీఛార్జ్ ప్యాక్ అందరి వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ రీఛార్జ్ ప్యాక్ లభ్యతపై కస్టమర్ కేర్‌ను సంప్రదించి ,ఆఫర్ లభ్యతపై చెక్ చేసుకోవాలి. Airtel అంతేకాదు ఎయిర్‌టెల్ పే మెంట్ బ్యాంకులో ఖాతాను తెరిచిన కస్టమర్లకు రూ.349 రీచార్జ్‌పై 10శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా జీయో రీచార్జ్‌ప్యాక్‌లను అందుబాటులోకి తెస్తే జియోకి కౌంటర్‌గా ఎయిర్ టెల్ మరిన్ని ఇతర ప్రణాళికలను ప్రారంభించింది. రూ. 8 ప్లాన్: నిమిషానికి 30 పైసలతో స్థానిక + ఎస్‌టీడీ కాల్స్ 56 రోజులు వాలిడిటీ, రూ. 40 ప్లాన్: అన్‌లిమిటెడ్ వాలిడిటీతో రూ. 35 టాక్ టైం. రూ. 60 ప్లాన్: అన్ లిమిటెడ్ వాలిడిటీతో రూ.58 టాక్ టైం. రూ. 5 ప్లాన్: 4జీబీ 3జీ / 4జీ డేటా, వాలిడిటీ 7 రోజులు 4జీ సిమ్ చెల్లుబాటు అయ్యే లా వన్ టైం రీచార్జ్ రూ. 199 ప్లాన్: అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 1Gజీబీ 2జీ / 3జీ/ 4జీ డేటా, 28 రోజుల వాలిడిటీ మరోవైపు మరికొద్ది రోజుల్లో జియో 4జీ ఫోన్లు కస్టమర్ల చేతికి రానున్నాయి. ఇప్పటికే లక్షలమంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో ఎయిర్‌టెల్ సైతం రూ.2500కు ఫీచర్ ఫోన్ తీసుకొచ్చేందుకు యోచిస్తున్న సంగతి తెలిసిందే. రేయ్‌నా & శేఖర్‌లు అదృశ్య శక్తులపై విజయం సాధిస్తారా? విఐయులో TRENDING ARTICLES విఐయులో ఉచితంగా మీకు నచ్చిన సెలబ్రిటీలతో కలిసి చూడండి జియోకు దీటుగా ఆకట్టుకునే ప్లాన్స్ వదిలిన ఎయిర్‌టెల్ రూ. 1000 నోటుపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం మొండి బకాయిలు: బ్యాంకులకు 26 కంపెనీల జాబితా పంపిన ఆర్‌బీఐ బింగే వాచ్ పిల్ల VIUపై మాత్రమే ఉచితం! గ్రంథి మల్లికార్జున రావు వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు 5జీ కోసం సంప్రదింపులు మొదలుపెట్టిన ట్రాయ్ 258 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ లోన్ అప్రూవల్‌కు ముందు బ్యాంకులు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తాయి వోడాఫోన్-హచిసన్ : రూ.32 వేల కోట్ల జరిమానా Read More About: airteljiotelecom Published On September 2, 2017 English Summary India's biggest telecom operator Airtel has introduced a Rs. 399 recharge pack for prepaid subscribers, offering unlimited local and STD calls, 1 GB data per day for 84 days at 4G speed. This offer is similar to Reliance Jio's Rs. 399 plan ADVERTISEMENT SUBSCRIBE TO OUR DAILY NEWSLETTER About•Terms of Service•Privacy Policy•Contact Visit Other Greynium Sites © 2017 Greynium Information Technologies Pvt. Ltd. Prev Article
No comments:
Post a Comment