హైదరాబాద్: కేంద్ర మంత్రి పదవికి భాజపా నేత దత్తాత్రేయ రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన అధిష్ఠానానికి వెల్లడించారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీ అవసరాల మేరకు పనిచేస్తానని ఆయన తెలిపారు. ఈ విషయమై గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమై చర్చించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment