ఎన్నికలు ముగియగానే ముద్రగడ ఉద్యమాన్ని వాయిదా వేశారని మంత్రి ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై త్వరలోనే నివేదిక రానుందని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ప్రతిపక్షనేత జగన్ వ్యాఖ్యలు సహించరానివిగా ఉన్నాయన్నారు. అందుకే ఆయన్ను రెండు చోట్లా ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్ ప్రతి గడపా తొక్కినా.. ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. నంద్యాల, కాకినాడల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పారని, ఆ యుద్ధంలో తెదేపా గెలిచిందన్నారు.

No comments:
Post a Comment